Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
- టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్
- ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కార్యక్రమంలో టర్కీ చేరే అవకాశం
- ఇజ్రాయెల్, కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2019లో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటూ.. టర్కీకి మళ్లీ ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కార్యక్రమంలో చేరే అవకాశం కల్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని పలువురు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని నివేదిక పేర్కొంది.
అమెరికా ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ అధికారులను ఉటంకిస్తూ వచ్చిన కథనం ప్రకారం.. నాటో సమావేశాల సందర్భంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో జరిగే భేటీలో ఈ అంశంపై ట్రంప్ చర్చించనున్నారు. టర్కీని మళ్లీ ఎఫ్-35 కార్యక్రమంలోకి తీసుకురావాలన్న తన ఉద్దేశాన్ని అధికారికంగా లేఖల మార్పిడి ద్వారా కూడా తెలియజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేసిన నేపథ్యంలో 2019లో టర్కీని అమెరికా ఎఫ్-35 కార్యక్రమం నుంచి తొలగించింది. ఒకేసారి ఎఫ్-35 యుద్ధ విమానాలు, రష్యన్ ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తే ఎఫ్-35 స్టెల్త్ సాంకేతికతకు సంబంధించిన కీలక సమాచారం రష్యాకు చేరే ప్రమాదం ఉందని అప్పటి ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా టర్కీ రక్షణ కొనుగోలు సంస్థపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. అవి ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయి. అయితే 2020లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన చట్టం ప్రకారం.. టర్కీ దగ్గర ఉన్న ఎస్-400 వ్యవస్థ పూర్తిగా తొలగించబడిందని అమెరికా ప్రభుత్వం ధృవీకరించింది. దీంతో ఎఫ్-35 విమానాల విక్రయానికి అనుమతి ఇవ్వాలని చూస్తోంది. ఎస్-400 వ్యవస్థను మూడో దేశానికి బదిలీ చేయడం లేదా దానిలోని కీలక భాగాలను తొలగించి పనికిరాకుండా చేయడం వంటి ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు నివేదిక తెలిపింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు.
టర్కీ గత కొన్నేళ్లుగా తమను తిరిగి ఎఫ్-35 కార్యక్రమంలో చేర్చాలని అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 వ్యవస్థను వదులుకోవడానికి మాత్రం నిరాకరిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. ట్రంప్ ఆదేశాల మేరకు రక్షణ శాఖతో పాటు సంబంధిత అధికారులు చట్టపరమైన అంశాలను సమీక్షిస్తున్నారని తెలిపారు. దీనిపై ట్రంప్ కూడా స్పందిస్తూ.. ‘‘ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటాం.’’ అని వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్, కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత
అయితే టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాల సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నానికి అమెరికా కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెనేట్ విదేశాంగ కమిటీ చైర్మన్ జిమ్ రిష్ ఈ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా టర్కీకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తరచూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి దేశానికి ఎఫ్-35 వంటి అధునాతన యుద్ధ విమానాలు ఇవ్వడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
నాటో సమావేశంలో కీలక చర్చలు
నాటో సదస్సు కోసం ట్రంప్ మంగళవారం టర్కీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా సమావేశం కానున్నారు. నాటో సభ్య దేశాలు రక్షణ వ్యయాలను పెంచడం, ప్రాంతీయ భద్రత, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
- Tags
- Donald Trump
- F-35
- trump
- Turkey
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..