Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
- నిర్లక్ష్యంపై పొంగులేటి సీరియస్
- తహసీల్దార్ సుజాతపై సస్పెన్షన్ వేటు
- రాయికల్ MROకు షోకాజ్ నోటీసు
- ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం.. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు
ప్రజా సమస్యల పరిష్కారంలో , అధికారుల పనితీరులో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. విధుల్లో తీవ్ర అలసత్వం వహించిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ సుజాతను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే సమీక్షా సమావేశంలో ప్రాజెక్టులపై సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాయికల్ ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధరణి పోర్టల్ నిర్వహణలో గతంలో జరిగిన అవకతవకలపై , విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఎలాంటి సిఫార్సులు చూడకుండా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి పథకాలపై కీలక ప్రకటనలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లిస్తుందని, ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ సిఫార్సులకు తావులేదని మంత్రి వెల్లడించారు. కాగితాలకే పరిమితం కాకుండా ఇప్పటికే రెండు విడతల్లో 8 లక్షల ఇళ్లను ప్రజలకు అందించామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ధరణి నియామకాలతో ప్రజలు పడిన ఇబ్బందులను తొలగించి, భూముల సమస్యలను సులభతరం చేసేందుకు ‘భూ భారతి’ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అయితే, గత పాలకులు భూ భారతిని కూడా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, దీనిపై ప్రత్యేక విచారణ కోసం ‘సిట్’ (SIT) ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!