Telangana: మద్యం సేవించటమంటే యువతకు ఓ ఫ్యాషన్‌లా మారిపోయింది. మందంటే చాటు ముందుంటున్నారు. ఇంతకుముందు ఏదైనా కారణముంటేనే దావత్‌లు ఓరేంజ్‌లో ఉంటుంది. అందంతా గప్పుడు కానీ.. ఇప్పుడు దావత్ అవసరంలే.. మందు తాగేందుకు కారణాలు వెతుక్కుంటూ అంతలా తాగుడుకు అలవాటుపడుతున్నారు. అందులోనూ మన తెలంగాణ పోరగాళ్లు మాత్రం మరీనూ.. బాద, సంతోషం ఏదైనా సరే, మందు గ్లాసులు గలగలలాడాల్సిందే.. కారణం ఏదైనా సరే పార్టీల పేరుతో మోతాదుకు మించి మద్యం సేవించాల్సిందే.. దీంతో యువత మందుకు బాగా అవాటు పడుతున్న వారి సంఖ్య తెలంగాణలోనే అధికంగా ఉంటోందని ఓసర్వేలో వెల్లడించడం దీనికి నిదర్శనం. తెలంగాణలో ప్రతి ఇద్దరు పురుషుల్లో మద్యం తాగే వారి సంఖ్య దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉందంటా మరి. తెలంగాణ మజాకా మనతోటి మామూలుగా ఉందడు మరి సందర్భమేదైనా బాటిళ్లు పొర్లేయాల్సిందే గట్లుంటది మనతోటి అంటున్నారు తెలంగాన యువత.
Read also: Earthquake: వణికిస్తోన్న వరుస భూకంపాలు.. తెల్లవారుజామున అండమాన్‌లో భూప్రకంపనలు
జాతీయ కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 27,351 ఇళ్లలోని 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిటీల్లో కంటే పల్లెటూళ్లోనే 49శాతం మంది మగవాళ్లు చుక్కవేయడంలో ముందున్నారని తేలింది. కాగా, ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యం మత్తులో తేలిపోతున్నారన్నమాట. ఇక సీటీల్లో అయితే.. ప్రతి ముగ్గరిలోనూ ఒకరు తాగుబోతులే.. ఈవిషయం తెలంగాణతో పోలిస్తే ఏపీ కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. అక్కడ ప్రతినలుగురిలో ఒకరు మాత్రమే మద్యం తాగుతున్నట్లు వెల్లడించి సర్వే సంస్థం. రాష్ట్రంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మద్యానికి బానిసలైన వారిలో యువతే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పార్టీలు, ఫంక్షన్లలో యువకులు నిర్ణీత మోతాదుకు మించి మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువగా మద్యానికి బానిసలు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఏటా పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో ఎక్సైజ్ శాఖ రూ. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల ద్వారా 2700 కోట్లు. అక్టోబర్ నెలలో ఈ విక్రయాలు రూ. 3037 కోట్లు. ఇందులో అంతకుముందు మాత్రమే రూ. 300 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు మంచినీళ్లలా మందు తాగుతున్నారు. ఈ విషయంలో మనకన్న తోపులు లేరంటూ సవాల్ విసురుతున్నారు మన తెలంగాణ పోరగాళ్లు. తెలంగాణ మొనగాళ్లా.. మాజాకా అంటూ తొడకొడుతూ మందులో ముందుకు సాగుతులన్నార మరి.
ఆప్రికాట్ పండు తినటం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు