Power Bill Hike: విద్యుత్ ఛార్జీల పెంపు.. వివరాలు వెల్లడించిన ఈఆర్సీ
- విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ స్పష్టీకరణ
- ₹9,583 కోట్ల రెవెన్యూ లోటు.. ప్రభుత్వ మద్దతు ఆశలు
- రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
- గృహజ్యోతి పథకం – వినియోగదారులకు పెద్ద ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power Bill Hike: తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై ఈఆర్సీ స్పందించింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదని ఈఆర్సీ తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి టారిఫ్ పెంపు కానీ, ‘టైమ్ ఆఫ్ ద డే’ ఛార్జీల పెంపు కానీ ఉండబోదని ఈఆర్సీ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదికి సుమారు ₹50,242 కోట్ల ఆదాయ అవశ్యకత ఉంటుందని అంచనా వేసిన సంస్థ, ప్రస్తుత ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం ₹40,659 కోట్లు మాత్రమేనని వివరించింది. ఈ క్రమంలో ఏర్పడే సుమారు ₹9,583 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక మద్దతును ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన వ్యయం పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం ఈ గ్యాప్‌ను భరించనుందని స్పష్టమవుతోంది.
Nepal Elections: నేపాల్ ఎన్నికల్లో బాలెన్ షా చేతిలో “భారత వ్యతిరేకి” ఘోర ఓటమి..
Also Read
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం , వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా ఎస్‌పీడీసీఎల్ (SPDCL) పరిధిలో గత ఏడాదితో పోలిస్తే కొత్తగా సుమారు 12 లక్షల మంది వినియోగదారులు చేరడం గమనార్హం. ప్రస్తుతం మొత్తం కనెక్టెడ్ లోడ్ 35,175 MVAలకు చేరుకోగా, గరిష్ట విద్యుత్ డిమాండ్ 20,975 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వినియోగం పరంగా చూస్తే పారిశ్రామిక రంగం 31 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, గృహ రంగం 23 శాతం, వ్యవసాయ రంగం 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు భరోసా ఇచ్చారు.
డిస్కంల పనితీరులో కూడా గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. పంపిణీ , సరఫరా నష్టాలను 9.60 శాతం నుండి 8.04 శాతానికి తగ్గించడంలో సంస్థ విజయం సాధించింది. అలాగే, విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా యూనిట్‌కు ₹6.35 నుండి ₹5.54కు తగ్గడం గమనార్హం. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వినియోగదారులకు గొప్ప వరంగా మారింది. ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 30 శాతం గృహ వినియోగదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ₹1930.66 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది. ఈ పథకం వల్ల విద్యుత్ చౌర్యం కూడా గణనీయంగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!