ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రెండు పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
Gruha Jyothi Scheme: ఆరు హామీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు హామీలు అమలు చేశారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.