Constable Exam: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష.. వదంతులు నమ్మొద్దు
తెలంగాణలో లక్షలాదిమంది అభ్యర్ధులు పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమనరీ పరీక్ష కూడా జరిగింది. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష(Constable Preliminary Exam) ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప్రశ్నపత్రంలో గందరగోళం ఏర్పడింది. కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వార్తలు.. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది.
Read Also: Mrunal Thakur : ‘సీతారామం’తో మృణాల్ ఖాతాలో మరో మిలియన్ ఫాలోవర్స్
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై దృష్టి పెట్టింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు నమ్మవద్దంటూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. సెట్ డి లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్ కు ఫిర్యాదులు అందాయి. పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని, రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. వివరణ ఇచ్చేంతవరకు వదంతులు నమ్మవద్దంటూ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు.

నిపుణుల కమిటీ తో చర్చించి వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది రిక్రూట్మెంట్ బోర్డ్. 15,644 పోస్టులకు గాను 9.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రిలిమినరీ పరీక్షలో మైనస్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా సమాధానాలు గుర్తించారు. 60 మార్కులు సాధించిన ప్రతీ అభ్యర్థి దీనిలో అర్హత సాధిస్తారు. తర్వాత ఫిజికల్ టెస్టులకు అభ్యర్థులు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది సువర్ణావకాశంగా చెప్పాలి. తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు దొర్లాయని వార్తలు వచ్చాయి. 13 ప్రశ్నల్లో గందరగోళం ఉన్నట్టు గుర్తించారు. ఫిర్యాదులు ఎక్కువ వస్తే మార్కులు కలిపే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా 8 మార్కులు కలిపేందుకు అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!