NTV Telugu Site icon

Mahmood Ali: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్‌

Mahamood Ali

Mahamood Ali

Mahmood Ali: దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్‌ అని హోంమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సందర్భంగా C.A.P. సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ ఫామ్ లాంచ్ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ అంజనికుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, రోనాల్డ్ రోస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ,విద్యాశాఖ సెక్రెటరీ కరుణ, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సైబర్ అంబాసిడర్స్ ఫ్లాట్ ఫామ్ లోగోను హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్‌ అన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని, కరోనా టైం నుంచి సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని తెలిపారు. పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. టెక్నాలజీ పెరిగింది.. దీంతో పాటు సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ప్రజల కోసం పొలీసులు నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారన్నారు. సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాల నియంత్రణ కోసం పని చేస్తారని, సైబర్ అంబాసిడర్స్ కు సైబర్ కంట్రోల్ బాధ్యత ఉందని హోంమంత్రి తెలిపారు. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయని మహమూద్‌ అలీ తెలిపారు.

Read also: Rainbow Children’s Hospital: పిల్లలు పక్కతడుపుతున్నారా..? అయితే ఈ చికిత్స అవసరం

ఇక డీజీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. పెట్రోల్ వెహికిల్స్ లాగా సైబర్ పెట్రోల్ వచ్చిందని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ లో ముందు ఉండాలని తెలిపారు. సేఫ్టీ అంటే ఫిజికల్ నే కాకుండా.. డేటా,సెక్యూరిటీ ,సేఫ్టీ లో ముందు ఉండాలని తెలిపారు. రోనాల్డ్ రోస్.. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రెటరీ విద్యాశాఖ సెక్రెటరీ కరుణ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ స్కూల్ లో ఈ సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి స్కూల్ నుంచి 4 గురిని సెలెక్ట్ చేసి సైబర్ నేరాలపై ట్రైనింగ్ ఇస్తామన్నారు. వాళ్లు ఆ స్కూల్స్ లో అందరికి సైబర్ నేరాలపై అవగాహన ల్పించి, అప్రమత్తం చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలు తగ్గేవిదంగా కృషి చేయాలన్నారు. 380 స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
Telangana CS: తెలంగాణ నెక్ట్స్ సీఎస్ ఎవరు?.. రేసులో ఆ నలుగురు ?