IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Transfers in Telanagana: తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 29 మంది సీనియర్ అధికారులను వివిధ హోదాల్లో బదిలీ చేస్తూ.. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
బదిలీలు..
* తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా డీజీ రాజీవ్‌రతన్
* తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య
* కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని అదనపు డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ
* రోడ్ సేఫ్టీ అదనపు డీజీగా బి.శివధర్‌రెడ్డి రైల్వేస్ బదిలీ అయ్యారు.
* అదనపు డీజీ వెల్ఫేర్, స్పోర్ట్స్‌గా.. హోంగార్డ్స్ అదనపు డీజీగా అభిలాష బిస్త్‌ను పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు.
* డీజీ ఉమెన్ సేఫ్టీ, షీటీమ్స్, భరోసా సెంటర్స్ కు షికా గోయల్‌ను బదిలీ చేశారు.
* డీజీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌గా వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
* టీఎస్‌ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా స్వాతిలక్రాను బదిలీ చేశారు.
* విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీగా బదిలీ చేశారు.
* తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీగా వై.నాగిరెడ్డిని బదిలీ చేశారు.
* హైదరాబాద్ సిటీ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా విక్రమ్ మాన్‌సింగ్‌ను నియమించారు.
* హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు సీపీగా జి.సుదీర్‌బాబును బదిలీ చేశారు.
* మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న షాహ్నవాజ్ ఖాసీంకు మల్టీజోన్ –2 ఐజీగా బాధ్యతలు అప్పగించారు.
* ఐజీ ట్రైనింగ్స్‌గా తరుణ్ జోషిని నియమించారు.
Also Read
#Hyderabad
Major reshuffle in #TelanganaPolice 29 IPS officers transferred. pic.twitter.com/VTaD74vRLA— Siddharth Kumar Singh (@siddharthk63) January 3, 2023
* ఐజీ పర్సానెల్‌గా బాధ్యతలు వీబీ కమలాసన్‌రెడ్డికి అప్పగించారు.
* రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మల్టీజోన్–1 ఐజీగా బదిలీ చేశారు.
* హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా ఉన్న ఎం.రమేశ్‌ను డీఐజీ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్‌గా బదిలీ చేశారు.
* హైదరాబాద్ జాయింట్ సీపీగా ఉన్న కార్తికేయను డీఐజీ ఇంటిలిజెన్స్‌గా నియమించారు.
* తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేశ్‌నాయుడును రాజన్న జోన్ డీఐజీగా బదిలీ చేశారు.
* హైదరాబాద్ సిటీ సీఏఆర్ జాయింట్ సీపీగా ఎం.శ్రీనివాసులును బదిలీ చేశారు.
* డీఐజీ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు తఫ్సీర్ ఇక్బాల్‌ను బదిలీ చేశారు.
* హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డా.గజరావు భూపాల్‌ను రాచకొండ జాయింట్ సీపీగా నియమించారు.
* యాదాద్రి జోన్ డీఐజీగా రెమా రాజేశ్వరిని బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నల్లగొండ ఎస్పీగా కూడా కొనసాగుతారు.
* జోగుళాంబ జోన్ డీఐజీగా ఎస్పీ ర్యాంకులో ఎల్‌ఎస్ చౌహాన్‌ను నియమించారు.
* సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా కె.నారాయణ్ నాయక్‌ను నియమించారు.
* హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్‌గా జె.పరిమళ హన నూతన్‌ను బదిలీ చేశారు.
* కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఎస్పీగా ఆర్.భాస్కరన్‌ను నియమించారు.
OnePlus-11(5G) to launch in India: లాంఛింగ్ డేట్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు..
తాజావార్తలు
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్‌తో మరో రికార్డు
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!