Telangana Govt: సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 29 మంది సీనియర్ అధికారులను వివిధ హోదాల్లో బదిలీ చేస్తూ.. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.