OnePlus-11(5G) to launch in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’.. సరికొత్త మోడల్ సెల్‌ఫోన్‌ను స్వదేశంలో జనవరి 4వ తేదీన.. అంటే.. బుధవారం నాడు లాంఛ్ చేయబోతోంది. ఇండియాలో మాత్రం నెల రోజులు ఆలస్యంగా అందుబాటులోకి తీసుకురానుంది. లేటెస్ట్ లెవెన్ సిరీస్‌లో 5జీ టెక్నాలజీతో రూపొందించిన ఈ అప్‌డేటెడ్ మొబైల్ ఫోన్‌ను ఫిబ్రవరి 7వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న క్లౌడ్-11 ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది.
ఈ నేపథ్యంలో.. న్యూ డివైజ్ డిజైన్ మరియు ఇతర స్పెసిఫికేషన్లేంటో చూద్దాం.. మన దేశంలో వన్ ప్లస్-11(5జీ) మోడల్ మరియు వన్ ప్లస్ బడ్స్ ప్రొ-2తోపాటు ఇతర పరికరాలను కూడా మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నారు. అయితే.. ఈ లెవెన్ సిరీస్ పీస్ ధర ఎంత అనేది ఇంతవరకూ వెల్లడి కాలేదు. భారత్‌లో ‘వన్ ప్లస్-10 ప్రొ’ ప్రారంభ ధర 66 వేల 999 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందువల్ల.. లెవెన్ సిరీస్ స్టార్టింగ్ ప్రైస్ కూడా దాదాపు అదే రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు. చైనాలో ఎలాగూ ఈ నెల 4వ తేదీన విడుదల కానుంది కాబట్టి అక్కడ ఎంత ధరను డిసైడ్ చేశారనేది ఆ రోజు వెల్లడికానుంది. దానికి అనుగుణంగా.. ఇండియాలో ఏ రేటుకు విక్రయిస్తారో అంచనా వేయొచ్చు.
read more: IPL Cricket: ఇండియన్ ప్రాఫిటబుల్ లీగ్
వన్ ప్లస్ సంస్థ ఈ లెవెన్ సిరీస్ మొబైల్ ఫోన్ రియర్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్లకు సంబంధించిన ఇమేజ్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం.. లేటెస్ట్ వెర్షన్‌లో.. కెమెరా మాడ్యూల్‌ను మార్చారు. సర్క్యులర్ షేప్‌లో డిజైన్ చేశారు. ప్రస్తుతానికి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్‌లో లభిస్తున్న ఈ రెండు పరికరాలకు కూడా మ్యాట్ ఫినిష్ ఇవ్వటం గమనించాల్సిన విషయం. వన్ ప్లస్-11(5జీ)లో 6 పాయింట్ 7 ఇంచ్‌ల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే విత్ 120 Hz Refresh Rate ఉంటుందనుకుంటున్నారు. ఆక్సీజన్13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమర్చనున్నారు.
స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ చిప్‌సెట్‌తో రానున్న బేస్ వేరియంట్‌లో 12 జీబీ ర్యామ్, టాప్ ఎండ్ వేరియంట్‌లో 16 జీబీ ర్యామ్ ఉంటాయి. దీంతోపాటు.. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో భాగంగా.. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఐఎంఎక్స్ 890 సెన్సార్.. 48 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్581 సెన్సార్ మరియు 32 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్ విత్ సోనీ ఐఎంఎక్స్ 709 సెన్సార్ ఉంటాయి. ఈ డివైజ్‌కి ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇన్‌స్టాల్ చేశారు.
ఇక.. బ్యాటరీ మరియు ఛార్జింగ్ కెపాసిటీల విషయానికొస్తే.. వన్ ప్లస్-11(5జీ) మోడల్ మొబైల్ ఫోన్‌లో 5 వేల మిల్లీ యాంఫియర్ పర్ అవర్ బ్యాటరీ ఇస్తారు. దీనికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం ఉంటుంది. ఈ సంస్థ నుంచి గతంలో వచ్చిన డివైజ్‌ల మాదిరిగానే ఇది కూడా వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌లకు సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్-11(5జీ) రేటు, అందుబాటు తదితర వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.