రేపు అన్ని పీఎస్‌లలో కేసీఆర్‌పై ఫిర్యాదులు.. సోమవారం పార్లమెంట్‌లో దీక్ష..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నాయి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంలో సీఎంపై అన్ని పీఎస్‌లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ మాటల వెనక కుట్ర ఉందన్న ఆయన.. నరేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్ కి ఆదర్శం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అంటూ ఎద్దేవా చేశారు.. ఇద్దరి ఆలోచన నియంత పోకడ, రాచరిక పెత్తనం అని.. ఇలాంటి ఆలోచనలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
Read Also: ఎస్మాపై ప్రభుత్వం కసరత్తు.. ఈ రంగాలవారే టార్గెట్..!
Also Read
కేసీఆర్‌పై తెలంగాణ వ్యాప్తంగా రేపు అన్ని పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఎల్లుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తాం అన్నారు.. అంబేద్కర్ విగ్రహాలకు మహిళా నాయకులే పాలాభిషేకం చేయాలని సూచించిన ఆయన.. ఇక, సోమవారం.. పార్లమెంట్‌లో దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు.. కేసీఆర్ వ్యవహారంపై రాహుల్, సోనియా గాంధీతో మాట్లాడతాం.. భవిష్యత్ కార్యాచరణను పీఏసీలో చర్చిస్తాం అన్నారు.. ఇక, ఎనిమిదేళ్లు ఎన్నో అరాచకాలు చేసిన కేసీఆర్‌ని రాళ్లతో కొట్టేవాళ్లం.. ఆటవిక రాజ్యం కావాలని అనుకుంటే… మొదట శిక్షించేది నిన్నే అంటూ కేసీఆర్‌ను హెచ్చరించారు రేవంత్ రెడ్డి.. రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టే నిన్ను ఏం అనట్టేదన్న ఆయన.. నీకు రాజ్యాంగం ఇష్టం లేకపోతే . .అడవిలోకి పో అంటూ సలహా ఇచ్చారు.. వెంటనే కేసీఆర్ మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి.. లేదంటే బడిత పూజ తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!