Site icon NTV Telugu

Telangana : పంచాయతీ రాజ్ ఉద్యోగులకు భారీ ఊరట.. పెండింగ్ జీతాలు విడుదల

Ts Gov Logo

Ts Gov Logo

Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందిస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది.

Pawan Kalyan: వీరమల్లును బాయ్ కట్ చేసుకోమనండి

సేవల పొడిగింపు జరగకపోవడంతో గత మూడు నెలలుగా ఈ ఉద్యోగుల జీతాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. దీనితో వేతనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు జీవో జారీ కావడంతో వారి మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆర్థిక శాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు నిధులు కూడా చేరాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంతో, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలు నేడో, రేపో ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిర్ణయం వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించడంతో పాటు, వారికి పెద్ద ఊరట కల్పించింది. ప్రభుత్వ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగుల సేవలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy : అగ్రవర్ణాలను కూర్చోబెట్టి మాట్లాడాం.. కాంగ్రెస్‌ ఉంటేనే అన్నీ ఉంటాయి

Exit mobile version