Site icon NTV Telugu

Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ లేనట్టే..? ఎందుకంటే..?

Telangana

Telangana

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణపై సమాలోచనలు కొనసాగుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు. కాగా, గుర్తు, జాతీయ గీతానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. అయితే.. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీకగా ఉండే మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచిన కొన్ని చిత్రాలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Read also: Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు

ఈ లోగోను రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదుకు పైగా డిజైన్లను పరిశీలించగా, ఒక్కటి మాత్రమే ఖరారు చేసిందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో అవతారోత్సవం ఉన్న నేపథ్యంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర చిహ్నం మార్పును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలనే రాజముద్రను మారుస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారని, చార్మినార్ లోగోను తొలగిస్తున్నారని, హైదరాబాద్‌ను అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. కాకతీయ కళాక్షేత్రాన్ని ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రూపొందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు

Exit mobile version