ఈ ఏడాది డిసెంబర్‌కి హైదరాబాద్‌లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి అవుతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… ట్యాంక్ బండ్ దగ్గర నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబేద్కర్ ఆదర్శం అన్నారు.. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మాణం అవుతుంది.. ఎనిమిది నెలలుగా అంబేద్కర్ విగ్రహ పనులు ముమ్మరముగా సాగుతున్నాయి.. 55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడీ అవుతుంది.. ఈ ఏడాది డిసెంబర్ కి విగ్రహం పనులు పూర్తి అవుతాయన్నారు.
Read Also: RK: మంత్రి పదవి అవసరంలేదు.. ఎప్పటికీ జగనన్న సైనికుడినే..
ఇక, భారతదేశ ప్రజలకి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రాంతం స్ఫూర్తి కాబోతోందన్నారు కేటీఆర్.. తెలంగాణ ప్రయోజనాలకి ఎక్కడ భంగం కలిగిన అంబేద్కర్ బాటలో నడుస్తున్నామని.. మిగతా రాష్ట్రాలకి స్ఫూర్తి వంతంగా తెలంగాణ నడుస్తుందన్నారు.. రాష్ట్ర ప్రయోజనాలుకి ఎవరు విఘాతం, కేంద్రం అడ్డంకులు కల్పించినా పోరాడాతాం.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ సాధించామన్నారు.. మ్యూజియం, ధ్యాన మందిరం నిర్మించాలని సూచనలు వస్తున్నాయి… ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాంతాలను సందర్శించి నిర్మాణం చేపడతామన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమే ఈ విగ్రహం అన్ఆరు కేటీఆర్.. దేశ ప్రజలకు ఇదొక కానుక.. అంబేద్కర్ ఆశయాలు పూర్తి స్థాయిలో అమలు కావాలన్నారు.. ఆర్ధిక అసమానతలకి తావు లేకుండా దేశ ప్రజలు అందరు బాగుపడాలన్నారు కేటీఆర్.