DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసింది..
- మావోయిస్టుల అంతం: డీజీపీ ప్రకటన
- ఆపరేషన్ కగార్ ఫలితం
- అడవుల్లో అభివృద్ధి అడుగులు
- ఆదివాసీలకు కొత్త వెలుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు శాంతి గీతం వినిపిస్తోంది. దశాబ్దాల కాలంగా మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తోంది. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతరించిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ‘ఫేస్ టు ఫేస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కర్రెగుట్టల వంటి మారుమూల ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులను వివరించారు.
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టుల ఉనికి ఇప్పుడు తెలంగాణలో లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో పాటు, కీలక నాయకత్వం , సైన్యాధ్యక్షులు సైతం బయటకు రావడంతో ఆ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాలు నక్సల్ రహిత జోన్లుగా మారాయని, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!
గతంలో కనీస సౌకర్యాలు లేకపోవడమే నక్సలిజం పెరగడానికి ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు ఇప్పుడు బిటి రోడ్ల నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల ఆదివాసీలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లడానికి గ్రామస్తుల కోసం ప్రభుత్వం ఒక ఆటో , టూ వీలర్‌ను కమ్యూనిటీ వాహనాలుగా అందజేసింది. గతంలో 12-13 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ఇళ్లకు సోలార్ కందిళ్లను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం చీకట్లను తొలగిస్తోంది.
కనీసం ఆధార్ కార్డులు, ఓటు హక్కు వంటి కనీస గుర్తింపు కూడా లేని ఆదివాసీలకు ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఫలాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ బాస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, అటవీ వనరులను కాపాడుకుంటూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా, అభివృద్ధి ద్వారానే మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోంది. కర్రెగుట్టల వంటి ప్రాంతాల్లో వేసిన రోడ్లు కేవలం రవాణా కోసమే కాదు, ఆ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వేసిన బాటలు అని చెప్పవచ్చు.
Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!