Illegal IVF Centres : ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
- అక్రమ ఐవీఎఫ్ కేంద్రాలపై కొరడా
- వైద్యుల లైసెన్సుల రద్దుకు చర్యలు
- సరోగసి, ఏఆర్టీ చట్టాలపై నిఘా
- ప్రభుత్వ ఐవీఎఫ్ సేవల విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంతానలేమితో బాధపడుతున్న దంపతులను నమ్మిస్తూ, ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు, ఈ దందாவில் భాగస్వాములైన వైద్యుల లైసెన్సులను కూడా శాశ్వతంగా రద్దు చేసేందుకు తీవ్ర చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అండాల అక్రమ సేకరణ ముఠాలతో సంబంధాలున్న ఐవీఎఫ్ సెంటర్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోఠిలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
Also Read
- Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
- Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
- DGP CV Anand: "పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం".. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
- SIR Process : ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా..?నమోదుకు మళ్లీ అవకాశం ఇచ్చిన ఈసీ
అక్రమాలపై సమగ్ర విచారణ.. కఠిన శిక్షలు తప్పవు
ఇటీవల వెలుగు చూసిన అండాల అక్రమ సేకరణ కేసు వివరాలను ఉన్నతాధికారులు మంత్రికి పూసగుచ్చినట్లు వివరించారు. ఈ అక్రమాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిపై, సంస్థపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దోషులకు చట్టప్రకారం కఠినమైన శిక్షలు పడేలా చూడాలని, ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. వైద్యుల లైసెన్సుల రద్దు ప్రక్రియ కోసం స్టేట్ , నేషనల్ మెడికల్ కౌన్సిళ్లతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.
సరోగసి, ఏఆర్టీ చట్టాల అమలుకు నిపుణుల కమిటీ
రాష్ట్రంలో సరోగసి , అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టాలు మరింత కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడటానికి ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టాల అమలు తీరుపై అధ్యయనం చేయాలని, కేంద్ర చట్టాల పరిధిలోనే రాష్ట్ర స్థాయిలో మరిన్ని అదనపు నియంత్రణ చర్యలను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను అప్రమత్తం చేశారు.
మందుల విక్రయాలపై నిఘా.. ప్రభుత్వ సేవల విస్తరణ
ఐవీఎఫ్ చికిత్సల్లో ఉపయోగించే మందుల తయారీ దశ నుంచి చివరికి విక్రయాల వరకు ప్రతిదానిపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు పటిష్టమైన నిఘా ఉంచాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. సంతానలేమితో ఐవీఎఫ్ సేవలు పొందే అమాయక దంపతులను ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. ఐవీఎఫ్ సేవల్లో పూర్తి పారదర్శకత, చట్టబద్ధత ఉండేలా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలను సమర్థవంతంగా అరికట్టినట్లే, తాజాగా అండాల అక్రమ సేకరణ ముఠా గుట్టురట్టు చేసినట్లు గుర్తుచేశారు. ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో పేదల ప్రాణాలతో చెలగాటమాడినా, దోపిడీకి పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మంత్రి.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ రంగంలో ఐవీఎఫ్ సేవల విస్తరణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Illegal IVF Centres : ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!