High Court: వెంటనే గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ తెరవాలి.. హైకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడ్డి అన్నారం – కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌ను వెంటనే తెరవాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.. అయితే, మార్కెట్లో ఉన్న సామాగ్రీ తీసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేయాలని సూచించింది.. బాటసింగారంలో మార్కెట్ యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని సెప్టెంబర్ 25న మూసివేసిన విషయం తెలిసిందే కాగా.. ఒక్కసారిగా మూసివేయడంతో మార్కెట్లోనే ఫర్నిచర్, ఏసీ సామగ్రి ఉండిపోయింది.. దీంతో, వాటిని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు మార్కెట్ సిబ్బంది.. అంతే కాదు, బాటసింగారం మార్కెట్లో వసతులు లేవని, ప్రభుత్వం హడావుడి చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మార్కెట్ సిబ్బంది..
Read Also: VH: రేవంత్‌పై వీహెచ్ ఫైర్.. పాత కాంగ్రెస్ వాళ్లు ఏం కావాలి..?
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ఇక, ఆ పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారించిన హైకోర్టు.. ఈ సందర్భంగా గతంలో కోర్టు ఇచ్చిన సమయం పూర్తైనా.. ఇంకా మార్కెట్ తెరవలేదని కోర్టుకు తెలిపారు సిబ్బంది.. దీంతో, కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. వెంటనే మార్కెట్ ఓపెన్ చేసి సిబ్బంది సామాగ్రి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఇక, హైకోర్టు ఆదేశాలతో 160 రోజుల తర్వాత కొత్తపేట పండ్ల మార్కెట్ తెరుచుకుంది.. మరోవైపు, ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు