గడ్డి అన్నారం – కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌ను వెంటనే తెరవాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.. అయితే, మార్కెట్‌లో ఉన్న సామాగ్రీ తీసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేయాలని సూచించింది.. బాటసింగారంలో మార్కెట్ యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని సెప్టెంబర్ 25న మూసివేసిన విషయం తెలిసిందే కాగా.. ఒక్కసారిగా మూసివేయడంతో మార్కెట్‌లోనే ఫర్నిచర్, ఏసీ సామగ్రి ఉండిపోయింది.. దీంతో, వాటిని తీసుకోవడానికి…