తెలంగాణలో కరోనా ఆంక్షలపై.. హైకోర్టు ఏం ఆదేశించనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే జీహెచ్‌ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు తమ రిపోర్టులో కోర్టుకు నివేదించారు.
Read Also: కరోనా ఎఫెక్ట్: నైట్ కర్ఫ్యూపై నేడు కీలక నిర్ణయం
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
గత విచారణలో పబ్లిక్ గేదరింగ్‌పై నిషేధం విధించాలని హైకోర్టు ఆదేశించడంతో పబ్లిక్ ర్యాలీలు, సమావేశాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా టెస్టుల సంఖ్య పెంచాలని కూడా గత విచారణలో కోర్టు సూచించింది. అటు చిన్నారుల కోసం నీలోఫర్‌తో పాటు ఇతర ఆస్పత్రుల్లో వసతులు పెంచాలని ఆదేశించింది. థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లలో నిబంధనలు కఠినతరం చేయాలని కూడా హైకోర్టు సూచించింది. కాగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే నైట్ కర్ఫ్యూ విధిస్తారు. అయితే ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఉండటంతో నైట్ కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!