సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత వివాదాస్పద వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డిఅని… కేసీఆర్ కి ఈయన ప్రీతి పాత్రుడని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని… రెవెన్యూ ఆదాయం కొల్లగొట్టేందుకు కేసీఆర్… వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుప్పం నియోజక వర్గ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి అని మండిపడ్డారు.…
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లోని సీఎస్ సోమేష్ కుమార్‌కు అందజేశారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది కలెక్టర్‌గా రిటైర్డ్ కానుండగా ఒక ఏడాది ముందే వెంకట్రామిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also: రాములవారి కంట కన్నీరు… ఆందోళనలో…
యాసంగిలో వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. Read Also: మరోసారి చైతన్య ఇంటికి సమంత..?…