వానకాలం సీజన్ నుంచి సన్న రకం వరిపంటకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా రైతులు నాట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు . మార్కెట్‌లో సన్న రకం వరిపంటకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో రైతులు పంటకు దూరంగా ఉంటున్నారు. దాదాపు 20 నుంచి 30 శాతం మంది రైతులు సన్న రకాన్ని సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి మార్పు లేదు. అధిక పెట్టుబడి, తక్కువ దిగుబడి,…
తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఎదురు చూస్తున్న రైతుబంధు పంపిణీ రేపటి (జూన్ 28) నుంచే ప్రారంభానికి సర్వం సిద్దమైంది. రేపు మంగళవారం నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింది రైతు బంధు నిధులు అందనున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా.. వెంటనే సీఎస్ సోమేష్ కుమార్ రైతు బంధు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే…
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యథావిధిగా వరిని సాగుచేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుటారని భావించినప్పటికీ.. వరినే సాగుచేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పటికే వానాకాలం వరి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను సైతం వ్యవసాయ…
యాసంగిలో వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. Read Also: మరోసారి చైతన్య ఇంటికి సమంత..?…