Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
- రోహిణీ కార్తె ఎఫెక్ట్.. తెలంగాణలో 46.5°C దాటిన ఉష్ణోగ్రతలు
- కుమురం భీం నుంచి సూర్యాపేట వరకు రెడ్ అలర్ట్ పరిస్థితి
- హైదరాబాద్‌లోనూ పెరిగిన వేడి.. బయట అడుగుపెట్టలేని పరిస్థితి
- మరో మూడు రోజులు ఇదే తీవ్రత.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heatwave : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణీ కార్తె ప్రవేశించిన వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తెలంగాణ ప్రణాళికా సంఘం (TGDPS) మే 25న విడుదల చేసిన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 డిగ్రీల నుండి ఏకంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో జనం ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే మొదలవుతున్న ఎండ తీవ్రత, మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
రాష్ట్రంలోనే అత్యధికంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో పాటు సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో 46.4 డిగ్రీలు, నల్గొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 46.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో 46.2 డిగ్రీలు, జగిత్యాలలో 46.1 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో 45.9 డిగ్రీలుగా ఎండ తీవ్రత నమోదైంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేసి రెడ్ అలర్ట్ పరిధిలోకి వచ్చేశాయి.
Also Read
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
- Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే.. నగరంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చుట్టుపక్కల ఉండే మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 42.4, రంగారెడ్డిలో 43.1, సంగారెడ్డిలో 42.1 డిగ్రీల చొప్పున ఎండలు ఉన్నాయి. కేవలం నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రమే నిన్నటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదై కాస్త ఉపశమనం కలిగించాయి. అయితే, రాబోయే మూడు రోజుల వాతావరణ ముందస్తు సూచనలు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవు. రానున్న రోజుల్లో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల్లో ఎండలు మరింత ముదిరి 45.7 డిగ్రీల వరకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యం గా మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!