Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
- వర్షంతో మారిన కొండా దంపతుల భేటీ వేదిక
- కార్యకర్తలు, ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చ
- సురేఖకు కీలక పదవిపై అధిష్ఠానం హామీ?
- సమావేశం తర్వాత ఢిల్లీ పయనం.. ఏం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో సంచలన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ మొదటిసారిగా తమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దృష్టి సారించిన కొండా దంపతుల ఈ భేటీ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
వర్షం కారణంగా హోటల్‌కు మారిన సమావేశ వేదిక
తొలుత హనుమకొండ రాంనగర్‌లోని కొండా సురేఖ నివాసంలోనే ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే, వరంగల్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కార్యకర్తల సౌకర్యార్థం సమావేశ వేదికను స్థానిక ఒక ప్రముఖ హోటల్‌కు అత్యవసరంగా మార్చారు. బర్తరఫ్ తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మీటింగ్‌కు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కొండా అనుచరులు, ముఖ్య నేతలు తరలివచ్చారు.
Also Read
హైకమాండ్ హామీలు.. ఢిల్లీ పయనంపై ఉత్కంఠ
కాంగ్రెస్ అధిష్ఠానం సురేఖను బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి కలిగిన ఒక ముఖ్యమైన పదవిని కేటాయించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తీవ్ర ప్రచారం సాగుతోంది. స్థానిక హోటల్లో కార్యకర్తలతో పూర్తిస్థాయిలో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కొండా సురేఖ నేరుగా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిష్ఠానంతో జరిగే చర్చల తర్వాతే కొండా ఫ్యామిలీ తమ తదుపరి అడుగుపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!