Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
- 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతి
- సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలతో ప్రత్యేక అలంకరణ
- బడా గణేష్ వద్ద మొదలైన భక్తుల సందడి
- మూడంచల భద్రతతో పోలీసుల భారీ బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ నిర్మాణం పూర్తైంది. ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, పంచముఖాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. విగ్రహ నిర్మాణం పూర్తవడంతో బడా గణేష్‌ను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
పంచముఖ సంకటహర మహాగణపతి
ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి విభిన్న రూపంలో భక్తులను ఆకట్టుకోనున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, ఐదు ముఖాలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాగణపతికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Also Read
బడా గణేష్ వద్ద భక్తుల సందడి
విగ్రహ నిర్మాణం పూర్తవడంతో ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి నెలకొంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భారీ వాహనాలు రాకుండా పరిసర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మూడంచల పోలీస్ భద్రత
బడా గణేష్ వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడంచల భద్రతతో పాటు షీ టీమ్స్, క్రైమ్ మఫ్టీ పార్టీ, క్విక్ రియాక్షన్ టీమ్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, సిటీ టాస్క్‌ఫోర్స్ బలగాలను మోహరించారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!