Telangana : వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు.. మొత్తం 2,363 పోస్టులకు ఆమోదం
- వైద్య విధాన పరిషత్లో 2,363 ఖాళీల భర్తీకి ఆమోదం
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాల భర్తీ
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల విస్తరణకు ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ సేవలు మెరుగుపరచడం, ప్రభుత్వం నడిపే ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
WAR2 : ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్
Also Read
ఈ ఆమోదంతో వైద్య విధాన పరిషత్లో మొత్తం 2,363 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 944 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, 87 పోస్టులను మినిమం టైమ్ స్కేల్ విధానంలో, మరో 1,332 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.
UK: ఓ పార్టీలో కలిసి పాడిన విజయ్ మాల్యా, లలిత్ మోడీ.. వీడియో వైరల్
ఈ నియామకాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెరగనుండగా, పల్లెప్రాంతాల్లోనూ వైద్యం అందుబాటులోకి రావడానికి ఇది దోహదపడనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ నియామకాలు ఆ దిశగా వేయబోయే అడుగులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అవసరాలకు తగినట్టు తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం ప్రభుత్వ విధానానికి అద్దంపడుతోంది.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!