Telangana Govt: తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురువడంతో నదులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీని కారణంగా అనేక ప్రాంతాలు ధ్వంసమై అనేక మంది సర్వస్వం కోల్పోయారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. నేటి నుంచి వరద బాధితుల ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా, ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమ చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.
Read also: Singur Project: సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, పాడి పశువులు మరణిస్తే రూ.50 వేలు, మేకలు, గొర్రెలు చనిపోతే రూ.5 వేలు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతోంది. సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలు పోగొట్టుకున్న వారికి న్యాయం చేస్తామన్నారు. తడిసిన బియ్యం స్థానే సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి, నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులు తడిసిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
Top Headlines @9AM : టాప్ న్యూస్