తెలంగాణ రైతులకు శుభవార్త… వచ్చే నెలలో రైతుబంధు సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ఆర్థికసాయం రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతున్నదని సీఎం అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పంటసాయం వల్ల రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు అప్పులకు వెళ్లడం లేదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు కొని అధిక దిగుబడులు సాధిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల నియామకం వంటి చర్యలతో వ్యవసాయశాఖను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని, వారి కృషి కూడా ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడిందని అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించడంతో మరింత అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!