Telangana Government: కాంగ్రెస్ మరో హామీ..! నెలాఖరులోగా అమలుకు కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Government: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే హామీల అమలుకు సంబంధించిన ఫైలుపై రేవంత్ రెడ్డి సంతకం చేశారు. అనంతరం డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఆరు హామీల్లో చివరి పథకం కింద రూ.10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేశారు. ప్రస్తుతం ఈ రెండూ అమల్లో ఉండగా.. ఈ నెలాఖరులోగా మరో హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2,500 నెలవారీ స్టైఫండ్ కూడా హామీ ఇవ్వబడింది. అర్హులైన మహిళలకు రూ. 2,500 చెల్లింపు కార్యక్రమం ప్రారంభించబడుతుంది.
Read also: Damodar Raja Narasimha: నేడు నిజామాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన..
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నందున, అంతకుముందే పథకం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పథకం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలపై అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలు ఉండగా.. వారిలో కోటి 25 లక్షల మందికి నెలవారీ భృతి చెల్లిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇచ్చిన ప్రతిపాదనను తెలంగాణలో కూడా చెల్లిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితితోపాటు విద్యార్హతలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులోగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Ayodhya Ram temple: రామమందిరం, సీఎ యోగికి బాంబు బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్..
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..