KTR: ముస్లిం శ్మశానవాటికలకు 125 ఎకరాలు.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌కు పత్రాలు అందజేసిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ముస్లిం మైనార్టీల కోసం మోడల్ శ్మశాన వాటికల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 125 ఎకరాలు కేటాయిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిల్లాఖాన్ సీఈవో ఖాజా మొయినుద్దీన్ కు కేటాయింపు పత్రాలను అందజేశారు. ముస్లిం శ్మశాన వాటికల ఏర్పాటుకు 125 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది ఆగస్టు తొలివారంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. శ్మశాన వాటికల నిర్మాణానికి రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భూములు కేటాయించారు.
Read also: Fake Doctor: హైదరాబాద్‌లో బయటపడ్డ ఫేక్ డాక్టర్ బండారం.. బాధితుల్లో వీఐపీలు..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
రంగారెడ్డి జిల్లా మజీద్పూర్లో 22 ఎకరాలు, ఖానాపూర్‌లో 42.22 ఎకరాలు, కొందుర్గు మండలంలో 10 ఎకరాలు. మేడ్చల్ జిల్లా నూతనకల్ లో 35.27 ఎకరాలు, తుర్కపల్లిలో 16.31 ఎకరాలు మంజూరయ్యాయి. శ్మశాన వాటికల్లో ప్రత్యేక నడక మార్గాలు ఉండాలని, అక్కడి కార్యక్రమాలకు ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని, ప్రహరీగోడలు నిర్మించాలని మంత్రి కేటీఆర్ వక్ఫ్ బోర్డుకు సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, బలాల తదితరులు పాల్గొన్నారు. అయితే గతంలో ముస్లిం శ్మశాన వాటికకు భూమి కేటాయించడంపై స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములను చెప్పారు. ఈ మేరకు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆ భూములను వక్ఫ్ బోర్డుకు అప్పగించారు.
Fake Doctor: హైదరాబాద్‌లో బయటపడ్డ ఫేక్ డాక్టర్ బండారం.. బాధితుల్లో వీఐపీలు..!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!