CM Revanth Reddy : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో జరిగిన కీలక సమావేశం ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ (GHMC) విస్తరణ వంటి ప్రధానాంశాలపై లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 29వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభం అనంతరం కొద్దిపాటి విరామం ఇచ్చి, తిరిగి జనవరి 2వ తేదీ…
RV Karnan: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సమగ్ర వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధి గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 2060 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని తెలిపారు. ఈ విస్తరణతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ మారిందన్నారు. వార్డుల విభజన ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా ఎక్సర్సైజ్ చేసి రూపొందించారని కమిషనర్…
GHMC : జీహెచ్‌ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల, బయట ఉన్న 27 పురపాలక సంస్థలను జీహెచ్ఎంసీ…
GHMC : హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా మరింత విస్తరింపజేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో, ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఒకే పట్టణ ప్రణాళిక కింద మొత్తం మెట్రో ప్రాంతాన్ని తీసుకువచ్చి, రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వంటి సేవల్లో సమాన స్థాయి అందించడం…