తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటుంది. దీంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొన్న శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద…