DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Anjani Kumar: సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ-2023 ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైబర్ స్పేస్ మేనేజ్‌మెంట్ కోసం నేషనల్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై అంజనీ కుమార్ ప్రసంగించారు. సైబర్ నేరాలను పరిశోధించడానికి, నిరోధించడానికి ప్రత్యేకమైన సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మైక్రోసాఫ్ట్‌తో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో స్థాపించబడ్డాయన్నారు. దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి, గుర్తించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే సైబర్ క్రైమ్ కేసులు పెరిగిపోయాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారిందని డీజీపీ సూచించారు.
Read also: TSRTC Offer: భారీగా తగ్గిన ఆర్టీసీ బస్సు చార్జీలు.. ప్రయాణికులకు పండగే
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
సైబర్ సెక్యూరిటీలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు అంజనీకుమార్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో దాదాపు 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. సైబర్ నేరాల నియంత్రణలో ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) కీలక పాత్ర పోషిస్తోందని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1930 ద్వారా ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత సైబర్ ఆధారిత ఆర్థిక నేరాల పరంగా తెలంగాణ పోలీసులు విజయవంతంగా రూ. 65 కోట్లను నిలిపివేశారు. సైబర్ నేరాలను నిరోధించడానికి, తెలంగాణ పోలీసులు అదే సమయంలో సామాన్య ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు; సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్‌లుగా పోలీసు అధికారులు శిక్షణ పొందారని డీజీపీ తెలిపారు.
Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..