Paddy Procurement: ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు.. సీఎస్ సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.. ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు అధికారులు.. ఇక, రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా ఏవిధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 61,300 మంది రైతుల నుండి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినట్టు వెల్లడించారు. ఇక, ప్రస్తుతం 7.80 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. మరో 8 కోట్ల గన్నీ బ్యాగుల కొనుగోలు టెండర్ల ప్రక్రియ నేడు పూర్తవుతుందని.. వీటికితోడు మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులను జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి త్వరలోనే అందుతాయని చెప్పారు.
Read Also: Bandi Sanjay: సరూర్ నగర్ పరువుహత్యపై మండిపాటు
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాలనుండి అక్రమంగా ధాన్యం రాకుండా ఉండేందుకుగాను ఇతర రాష్ట్రాలనుండి సరిహద్దుగల 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు సీఎస్ సోమేష్ కుమార్.. సేకరించిన ధాన్యం వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని తద్వారా చెల్లింపులు త్వరితగతిన జరిగే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం సేకరణకు నిధుల సమస్యే లేదని ఇప్పటికే, రైతులకు చెల్లింపులు చేయడానికి రూ. 5000 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందని స్పష్టం చేశారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపడం జరుగుతుందని, నేటి వరకు 4 .3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపామని వెల్లడించారు. వరంగల్. గద్వాల్, వనపర్తి, భూపాల్ పల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యంగా అవుతాయని, వరి కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సీఎస్ సోమేష్ కుమార్.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!