గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.
గడచిన 24 గంటల్లో తెలంగాణలో 18,881 కరోనా పరీక్షలు నిర్వహించగా, 151 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,775 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,81,427 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,237 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.