తెలంగాణలో మరోసారి కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజు కరోనా కేసులు పెరుగతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పుంజుకోవడం ఆందోళన కలిగించే విషయం. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 24,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 247 మందికి పాజిటివ్ గా నిర్ధారణైంది. అత్యధికంగా హైదరాబాద్‌లో నిన్న 172 కేసులు వెలుగుచూడగా నేడు హైదరాబాద్ లో 157 కొత్త కేసులు వెలుగు చూసాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 116 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇంకా 1,912 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. తెలంగాణలో నేటివరకు 7,95,819 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,89,796 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఈ ఏడాది విద్యాసంవత్సరం ఈ నెలలో ప్రారంభమైంది. అయితే ఈ సమయంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.