అగ్రరాజ్య అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కరోనా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ సృష్టించిన థర్డ్‌వేవ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలోనే కట్టడి చేశాయి. అయితే ఇప్పుడు కూడా కరోనా ఫోర్త్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే తాజాగా మరోసారి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యం 2వందలు దాటింది.
గడిచిన 24 గంటల్లో 27,841 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 279 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే.. ఒక్క రోజు 119 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,781 కరోనా కేసుల యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 7,95,572 మందికి కరోనా సోకగా.. అందులో 7,89,680 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 4,111 మంది కరోనాతో మరణించారు.