Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రభుత్వం, పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా బహిరంగంగా విమర్శలు గుప్పించిన నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మంత్రి కొండా సురేఖతో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డిలకు క్రమశిక్షణా కమిటీ నోటీసులు పంపించింది.
కొండా సుస్మితా వ్యాఖ్యలపై సురేఖకు ఆదేశాలు
వరంగల్‌లో నిర్వహించిన ఓ వేదికపై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. రాబోయే ఎన్నికల్లో పరకాల అభ్యర్థిని ప్రకటించే హక్కు సీఎంబీకి ఎలా ఉంటుందని నిలదీస్తూ, అధిష్ఠానంతో సంబంధం లేకుండా తాను పరకాల నుంచే పోటీ చేస్తానని సుష్మిత బహిరంగంగా వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వం, నాయకత్వంపై ఇటువంటి విమర్శలు చేయడం తీవ్ర క్రమశిక్షణా రాహిత్యమని స్పష్టం చేసిన అధిష్ఠానం, ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను ఆదేశించింది.
Also Read
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
- Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వనపర్తి రాజకీయంలో చిన్నారెడ్డికి నోటీసు
మరోవైపు వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చెలరేగిన వివాదం కూడా అధిష్ఠానం వద్దకు చేరింది. స్థానిక ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించడం వల్లే తనకు టికెట్ దక్కలేదని, దీని కారణంగానే వనపర్తి నియోజకవర్గం నాశనమైందని ఆయన బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ తీవ్రమైన కామెంట్స్‌ను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణా కమిటీ, తన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని చిన్నారెడ్డికి స్పష్టం చేసింది.
లైన్ దాటితే సహించేది లేదని హెచ్చరిక
పార్టీ ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ పెద్దలపై లక్ష్మణ రేఖ దాటి బహిరంగ విమర్శలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ హెచ్చరించింది. ఇద్దరు ప్రముఖ సీనియర్ నేతలకు ఒకేసారి షోకాజ్ నోటీసులు జారీ కావడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు పార్టీలోని అసమ్మతివాదులకు ఎలాంటి హెచ్చరికగా మారనున్నాయో వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!