Site icon NTV Telugu

Congress Dinner Meet: టి.కాంగ్రెస్‌ డిన్నర్‌ మీట్.. ఒక్కచోట చేరిన సీనియర్లు..

Dinner Meet

Dinner Meet

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన అంశాలను తెర మీదకు తెచ్చారు రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్రానికి కొత్తగా జెండా ఏర్పాటు అంశాలపై కార్యాచరణ రూపొందించారు. దీనిపై జానారెడ్డి నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్, దామోదర రాజనర్సింహ.. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి.. మధు యాష్కీ మీటింగ్‌కు హాజరయ్యారు.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ల భేటీలో సెప్టెంబర్ 17, కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లిని ఏ పార్టీ పాటించడం లేదన్నారు జానారెడ్డి. కొత్త విగ్రహం కంటే.. భరత మాత తరహా విగ్రహం రూపొందించడం బెటర్ అని సూచించారు జానారెడ్డి. మరోవైపు రాష్ట్ర జెండా విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. కర్ణాటకలో ఏం జరిగిందనే దానిపై అధ్యయనం చేయాలని కోరారు. అటు ‘జయ జయహే తెలంగాణ’ అని అందే శ్రీ పాట కి సీనియర్స్ ఆమోదం పలికారు. కొత్త తెలంగాణ విగ్రహం ఏర్పాటుపై తొందర వద్దన్న నేతలు.. జనంలో చర్చ పెట్టి.. మార్పులు చేర్పులు చేద్దామన్నట్టు సమాచారం.

Read Also: AP Assembly Session Live Updates: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌..

మరోవైపు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంట్లో డిన్నర్ మీట్‌కు హాజరయ్యారు సీనియర్‌ నేతలు. కొత్తగా రాష్ట్రానికి ఏఐసీసీ కార్యదర్శులుగా ఎన్నికైన నదీం జావేద్, రోహిత్ చౌదరిలకు విందు ఇచ్చే క్రమంలో పార్టీ సీనియర్లను కూడా ఆహ్వానించారు. సీఎల్పీనేత భట్టి, ఉత్తమ్‌ పాటుగా సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్‌, షబ్బీర్ అలీ విందుకు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పొన్నం ప్రభాకర్ , మధుయాష్కీ లాంటి నేతలు కూడా ఈ సమావేశానికి వచ్చారు. పార్టీలో నాయకుల మధ్య ఐక్యతకు సంబందించి అంశాలపై చర్చించారు. నాయకులంతా ఏకధాటిపై ఉన్నారనే ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు మహేశ్వర రెడ్డి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో రెండు కీలక సమావేశాలు జరిగాయి. ఒకటి సెప్టెంబర్ 17 పై కాగా.. మరొకటి పార్టీలో నాయకుల మధ్య ఐక్యత కు సంబందించిన అంశం.

Exit mobile version