TG Cold Weather: తెలంగాణలో చలి వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో రెండు రోజులు వానలతో చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పొగమంచు కమ్ముకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 13.1, నల్లవల్లి 14.2, అల్గోల్ 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా శివంపేట 13.9, కాగజ్ మద్దూర్ 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 14.9, కొండపాక 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.
Read also: Mahesh Babu : మహేష్-రాజమౌళి మూవీ కోసం హాలీవుడ్ లెవల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్
అయితే సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌లో చలి ఎక్కువగా ఉంటుంది. కానీ తెలంగాణలో గత నెల నవంబర్‌లోనే చలి మొదలై… అల్పపీడన ప్రభావంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అంటే ఈ చలిని తెలంగాణ ప్రజలు మరికొద్ది రోజులు భరించాల్సిందే. ఈ అల్పపీడన ప్రభావం ముగిసిన తర్వాత కూడా తెలంగాణలో చలిగాలులు కొనసాగుతాయి. ఎందుకంటే సాధారణంగా చలికాలం జనవరిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మధ్యలో వచ్చే సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ చలి తీవ్రత తగ్గుతుంది. శివరాత్రి తర్వాత చలి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ చలి గాలులను భరించాల్సిందే.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?