భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేసీఆర్.. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని…