TPCC Chief Mahesh Goud: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ (మే 26) సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిశారు.
Read Also: Tamannaah : తమన్నాను తీసుకోవడం కరెక్ట్ కాదు.. నటి రమ్య షాకింగ్ కామెంట్స్..
ఇక, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ కి వివరించాను.. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని మనవి చేశాను.. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. మంత్రి వర్గ విస్తరణతో పాటు త్వరలోనే పీసీసీ కమిటీల ప్రకటన ఉంటుంది అన్నారు.
Read Also: Maoist’s Letter: నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై మావోయిస్టుల లేఖ..
అయితే, రాష్ట్ర కేబినెట్ విస్తరణ విషయంలో అధిష్టానానికి మేం మా వర్షన్ చెప్పామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నాం.. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు.. కేసి వేణుగోపాల్ పార్టీ అధిష్టాన పెద్దలతో మాట్లాడుతున్నారు.. ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుంది అని మహేష్ గౌడ్ వెల్లడించారు.
