Site icon NTV Telugu

TG Cabinet Expansion: రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..?

Congress

Congress

TG Cabinet Expansion: గత కొంత కాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు (జూన్ 8న) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అయితే, మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదిన్నరకు పైగా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో హస్తం పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్నారు.

Read Also: Rahul Gandhi: మహారాష్ట్ర తర్వాత, బీహార్‌లో కూడా ‘‘ఫిక్సింగ్’’ చేస్తారు.. స్పందించిన బీజేపీ..

అయితే, ఇటీవల మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వచ్చిన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమెను కలిసి మంత్రి పదవి కోసం ఆర్జీలు పెట్టుకుంటున్నారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు ఛాన్స్ కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలకు మొర పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై ఏఐసీసీ సంకేతాలు ఇచ్చింది. కాగా, రేపే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. దీనిపై ఈరోజు రాజ్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్‌భవన్ వర్గాలను సీఎం రేవంత్ కోరినట్లు టాక్. రేపు కేబినెట్ మంత్రులగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆ ముగ్గురు ఎవరనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది.

Read Also: TDP: టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తేనే చేరికలు..!

ఇక, మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రి వర్గంలో స్థానం కోసం బాగా ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదు.. ముదిరాజ్‌‌లకు కచ్చితంగా ఛాన్స్ ఇస్తామని గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే, మైనార్టీలకు కూడా కేబినెట్‌లో స్థానం లభించలేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక, రేవంత్ రెడ్డి కొత్త టీం ఎవరనేది రేపు (మే 8న) తెలిసే ఛాన్స్ ఉంది.

Exit mobile version