TG Cabinet Expansion: రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..?
- రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం..
- మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet Expansion: గత కొంత కాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు (జూన్ 8న) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అయితే, మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదిన్నరకు పైగా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో హస్తం పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్నారు.
Read Also: Rahul Gandhi: మహారాష్ట్ర తర్వాత, బీహార్‌లో కూడా ‘‘ఫిక్సింగ్’’ చేస్తారు.. స్పందించిన బీజేపీ..
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
అయితే, ఇటీవల మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వచ్చిన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమెను కలిసి మంత్రి పదవి కోసం ఆర్జీలు పెట్టుకుంటున్నారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు ఛాన్స్ కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలకు మొర పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై ఏఐసీసీ సంకేతాలు ఇచ్చింది. కాగా, రేపే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. దీనిపై ఈరోజు రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్‌భవన్ వర్గాలను సీఎం రేవంత్ కోరినట్లు టాక్. రేపు కేబినెట్ మంత్రులగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆ ముగ్గురు ఎవరనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also: TDP: టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
ఇక, మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రి వర్గంలో స్థానం కోసం బాగా ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్లో ప్రాధాన్యత లేదు.. ముదిరాజ్‌లకు కచ్చితంగా ఛాన్స్ ఇస్తామని గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే, మైనార్టీలకు కూడా కేబినెట్లో స్థానం లభించలేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక, రేవంత్ రెడ్డి కొత్త టీం ఎవరనేది రేపు (మే 8న) తెలిసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!