Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం, కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ వేగవంతం, క్రీడా రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలతో ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను ప్రకటించింది.
ఉద్యోగుల సంక్షేమంపై ఉదారత..
Also Read
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల ఉద్యోగుల బకాయిలపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో వంద రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైతే ప్రజాప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం నిధులు కేటాయించేందుకు మంత్రులు సిద్ధమయ్యారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సుమారు రూ. 14,200 కోట్ల బకాయిల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించింది.
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ సమరం..
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కేబినెట్ విశ్లేషించింది. కేవలం సాంకేతిక కారణాలతోనే కొన్ని అంశాలను కోర్టు తప్పుబట్టిందని, ఇది సీబీఐ దర్యాప్తుకు ఏమాత్రం అడ్డంకి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొమ్మిది నెలలుగా జాప్యం జరుగుతున్న సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. తదుపరి చర్యలపై ఢిల్లీ న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.
క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు 50 వేల సీటింగ్ సామర్థ్యం గల స్టేడియం నిర్మిస్తారు. మరోవైపు.. మంథని ప్రజల చిరకాల స్వప్నమైన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు రూ. 166.67 కోట్లు కేటాయించి, 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టింది. అలాగే, మంచిర్యాల జిల్లాలో 85 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
వీటితో పాటు.. పదవీకాలం ముగిసిన ‘పాక్స్’ (PACS) సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించాలని, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ చిత్తశుద్ధిని నమ్మి కార్మికులు సంయమనం పాటించాలని కోరింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!