OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై వేటేస్తారా?
- తెలంగాణ కాంగ్రెస్‌లో పెరుగుతున్న వోవర్ టూ ఢిల్లీ ఉత్కంఠ
- కొండా ఒక్కరి మీదే యాక్షన్ తీసుకుంటే తెర మీదికి కులాల వాదన
- ఇద్దరి మీద ఒకేసారి చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు?
- కొండా ఎపిసోడ్‌ను పార్టీ చూసుకుంటుందని సీఎం క్లారిటీ
- హైకమాండ్ వ్యూహం ఎలా ఉండబోతోందన్న చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడంతా… సింగిల్ పాయింట్ డిస్కషన్ నడుస్తోంది. అదే… క్రమ శిక్షణ చర్యలకు సంబంధించి. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా..? రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డిపై వేటు వేస్తారా..? హస్తిన నాయకత్వం ఏం చేయబోతోందంటూ ఎవరికి వారు చర్చలు పెట్టేస్తున్నారు. తమతమ పరిధిలోని సోర్స్‌లో ఆరా తీసేస్తున్నారు. రకరకాల విశ్లేషణలు సైతం జరిగిపోతున్నాయి. ఓవర్ టు ఢిల్లీ అన్న మాటలతో ఉత్కంఠ ఇంకా పెరిగిపోతోంది. ఈ వ్యవహారాలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నివేదిక సిద్ధం చేసి పీసీసీకి ఇచ్చేశారు. అందులో కఠిన చర్యలకు సిఫారసు చేశారాయన. క్రమశిక్షణ తప్పిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నదే కమిటీ నివేదిక సారాంశం. షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సమాధానం సరిగా లేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశం పెట్టి మరీ… చర్యలు తీసుకోవాలని చెప్పినందున యాక్షన్ ఉండాల్సిందేనన్న అభిప్రాయంతో… క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిందని అంటున్నారు.
సామాజిక సమీకరణాలు… ఇతరత్రా అంశాలన్నిటినీ పరిశీలించిన కమిటీ…. చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై కూడా సీరియస్‌గానే ఉందంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే… కులాల లెక్కలు తెర మీదికి వస్తాయి కాబట్టి… ఒకేసారి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఎలాగూ చిన్నారెడ్డి ఎపిసోడ్లో కూడా హైకమాండ్ సీరియస్‌గానే ఉంది కాబట్టి…. అటు కొండా సురేఖ…ఇటు చిన్నారెడ్డి మీద ఒకేసారి చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసిందన్నది అంతర్గత సమాచారం. అదే సమయంలో… కొండా ఎపిసోడ్‌ను పార్టీ చూసుకుంటుంది… ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పష్టంగా చెప్పినందున ఆ విషయంలో క్లారిటీ వచ్చినట్టేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో… ఓవరాల్‌గా కొండా, చిన్నారెడ్డి ఎపిసోడ్ హైకమాండ్ కోర్ట్లోకి వెళ్ళినట్టయింది. ఇద్దరి మీద వేటుకు రంగం సిద్ధమైందని పార్టీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతున్న క్రమంలో… హైకమాండ్ తన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?