Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telangana Byelection Is Brs Preparing Its Candidate For Khairatabad Already

Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఇప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సిద్ధం చేస్తోందా?

Published Date :November 17, 2025 , 9:59 pm
By Sampath Kumar
  • ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఖాయమన్న సంకేతాలు
  • వేటు పడే లిస్ట్‌లో దానం ముందుంటారన్న టాక్‌
  • బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ మీద ఇప్పట్నుంచే దృష్టి పెడుతోందా?
  • మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి వైపు చూస్తోందా?
  • దానంను ఎదుర్కోవాలంటే విష్ణునే కరెక్ట్‌ అనుకుంటున్నారా?
  • పీజేఆర్‌ లెగసీ, పాత పరిచయాలు
  • విష్ణు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టేనా?
Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఇప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సిద్ధం చేస్తోందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్‌ ఇప్పట్నుంచే అభ్యర్థిని సిద్ధం చేస్తోందా? జూబ్లీహిల్స్‌లో తగిలిన దెబ్బ పునరావృతం అవకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తపడుతోందా? ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే….అభ్యర్థి ఎవరో ఆల్రెడీ డిసైడ్‌ చేసేసిందా? బైపోల్‌ గ్యారంటీ అనుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? ఇంత ముందుగానే పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డ ఆ నాయకుడు ఎవరు?.

జూబ్లీహిల్స్‌ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక జరగడానికి గట్టి అవకాశాలున్న వాటిలో ఖైరతాబాద్‌ ముందు వరుసలో ఉంది. 2023లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్‌ తరపున గెలిచిన దానం నాగేందర్‌ తర్వాత కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అంతకు మించి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఫిరాయింపుల చట్టం ప్రకారం దానం నాగేందర్‌ మీద కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్న అంచనాలున్నాయి. అటు దానం కూడా వేటుకంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వేరే నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా… ఖైరతాబాద్‌లో మాత్రం కచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే… జూబ్లీహిల్స్‌లో దారుణంగా దెబ్బతిని సిట్టింగ్‌ సీటు కోల్పోయిన బీఆర్‌ఎస్‌… ఖైరతాబాద్‌ మీద ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి వైపు గులాబీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
  • Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..

Also Read: IND vs SA: రెండో టెస్ట్‌కు శుభ్‌మాన్ గిల్ దూరమైతే.. నంబర్ 4 స్థానంలో ఎవరు ఆడతారు?

ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌లో ప్రస్తుతం దానం నాగేందర్ స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్నారు. ఉప ఎన్నిక జరిగినా… పార్టీ ఆయనకే టిక్కెట్‌ ఇస్తుందనడంలో డౌట్‌ లేదు. అందుకే ఆయన్ని దీటుగా ఎదుర్కొనే నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తోందట బీఆర్ఎస్. ఆ క్రమంలోనే పీజేఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఫైనల్‌ కావచ్చని అంటున్నారు. గతంలో పీజేఆర్‌ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఇప్పటికీ ఆయన అభిమానులున్నారు. పీజేఆర్‌ చనిపోయాక అదే ఉమ్మడి ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు విష్ణువర్ధన్ రెడ్డి. మొన్నటి 2023 ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్‌లో ఉన్నా చివరి నిమిషంలో బీఆర్ఎస్ గూటికి చేరారు విష్ణు. అంతకు ముందు 2009 నుంచి 2014 వరకు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. దీంతో మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన కూడా టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు అన్నిటినీ బేరీజు వేసుకుని ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక జరిగితే… తమ అభ్యర్థిగా విష్ణువర్ధన్‌రెడ్డినే బరిలో దింపాలని కారు పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. పీజెఆర్ వారసత్వం, నియోజకవర్గం మీద కొంత పట్టు ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి అయితేనే ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ని గట్టిగా ఎదుర్కొంటారని బీఆర్‌ఎస్‌ అధిష్టానం గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • danam nagender
  • khairatabad
  • Khairatabad byelection
  • telangana

తాజావార్తలు

  • Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..

  • IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు.. స్లాప్‌గేట్ మళ్లీ వార్తల్లో

  • AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?

  • Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!

  • Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions