NTV Telugu Site icon

భాగ్యనగర్‌ టు హుజురాబాద్‌.. బండి సంజయ్‌ పాదయాత్ర

Bandi Sanjay

Bandi Sanjay

తెలుగు నేలపై పాదయాత్రలు కొత్త కాదు.. పాదయాత్రలు నిర్వహించి సీఎంలు అయినవారు ఉన్న నేల ఇది.. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారాయన.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్‌ వరకు నడవనున్నట్టు వెల్లడించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయిన బండి సంజయ్… హుజురాబాద్ ఉపఎన్నిక కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.. అందుకోసమే జల వివాదాన్ని తెరపైకి తెచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.. ఏది ఏమైనా.. హుజురాబాద్‌లో గెలిచేది ఈటల రాజేందరేనన్న బండి.. అధికార పార్టీకి అభ్యర్థి దొరకడం లేదు… పొర్లు దండాలు పెట్టిన అక్కడ గెలిచేది బీజేపీయే అన్నారు. ఇక, అడ్డదారిలో గెలిచే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోందంటూ టీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.