Telangana Assembly: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఘనస్వాగతం పలికారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన మొదలైందన్నారు. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, కొత్త సీఎం రేవంత్ రెడ్డి తాము పాలకులం కాదు సేవకులం అన్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తెలిపారు. ప్రజా పాలన మొదలైందన్నారు.
Read also: Parliament Attack: పార్లమెంట్ ఘటన నిందితుడి ఇంట్లో దొరికిన డైరీ.. వెలుగులోకి కీలక రహస్యాలు
ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళుతోందని తెలిపారు. బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలన్నారు. పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని అన్నారు. నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోందని తెలిపారు. నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తెలిపారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చిందని.. ఈ తీర్పు పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని అన్నారు. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలైపోయాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని తెలిపారు.
Guntur Kaaram: ట్రోల్ చేసిన వాళ్లకి అది చూపించిన నాగ వంశీ… వాళ్లు మహేష్ అభిమానులు సార్