సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రమోషన్స్ ని స్పీడప్ చేసిన మేకర్స్ గుంటూరు కారం నుంచి సెకండ్ సింగల్ ‘ఓ మై బేబీ’ని రిలీజ్ చేసారు. థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లిరిక్స్ ని రామాజోగయ్య శాస్త్రి రాసాడు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్ జరుగుతోంది. సాంగ్ బాగోలేదు, సాంగ్ ని మార్చండి, అసలు ఇదేమి సాంగ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రామజోగయ్య శాస్త్రి, థమన్, నాగ వంశీ, గుంటూరు కారం సినిమా అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లని ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ట్రోలింగ్ చేసే వారిపై సీరియస్ అవ్వగా లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇంకొంచెం ఘాటుగానే రెస్పాండ్ అయ్యాడు.
గుంటూరు కారం సినిమా విషయంలో మొదటి నుంచి కాస్త హైపర్ యాక్టివ్ గానే ఉన్న నాగ వంశీ… లేటెస్ట్ గా వస్తున్న ట్రోల్స్ పై మరీ హర్ష్ గా రియాక్ట్ అయ్యాడు. అనిమల్ సినిమాలోని ఎండ్ సీన్ ని పోస్ట్ చేసి ట్రోలింగ్ చేసే వారిని సైలెంట్ గా ఉండమని చెప్పాడు. మేము ఏమీ చేస్తున్నామో మాకు తెలుసు, జనవరి 12న కలుస్తాం అంటూ ట్వీట్ చేయడం వరకూ బాగానే ఉంది కానీ అనిమల్ ఎండ్ సీన్ ని పోస్ట్ చేయడమే బాగోలేదు. అది కూడా ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఇలా పైరసీ సీన్ ని అఫీషియల్ గా ట్వీట్ చేయడం ఇంకా సోషల్ మీడియా నెగిటివిటీకి దారి తీస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ నాగ వంశీ ట్వీట్ పై సీరియస్ గా ఉన్నారు. అయినా ఈ అభిమానులే మహేష్ బాబు సినిమాలని రిపీట్ మోడ్ లో చూసేది, రికార్డులు ఇచ్చేది… వాళ్ళు హద్దులు మీరితే కాస్త నిదానంగా చెప్పాలి కానీ మిడిల్ ఫింగర్ లు, అనిమల్ ఎండ్ సీన్లు పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో నాగవంశీ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
We know what we r doing! ✌️
See you guys on 12th jan pic.twitter.com/IKJwyPQuQD— Naga Vamsi (@vamsi84) December 15, 2023