భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్‌ను తలపించింది. పేరుకు టీ20 అయినా ఆ మెరుపులు ఎక్కడా కనిపించలేదు. ఆదివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ 20 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపు దక్కించుకుంది. కివీస్ తక్కువ లక్ష్యాన్నే నిర్దేశించినా మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. కాగా ఈ మ్యాచ్‌లో ఐదు రికార్డులు కూడా బద్దలయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కివీస్, ఇండియా రెండో టీ20కి ముందు లక్నోలో ఐదు T20Iలు జరిగాయి. అన్ని మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం అందుకుంది. అయితే ఆదివారం తొలిసారి లక్నోలో ఛేజింగ్ చేసిన భారత జట్టు గెలుపు సొంతం చేసుకుంది. లక్నోలో లక్ష్యాన్ని అందుకున్న మొదటి టీమ్‌గా నిలిచింది. కానీ భారత్ ఛేజింగ్ అంత సులువుగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
Toyota: ప్రపంచంలో ఈ సంస్థ కార్లదే హవా..వరుసగా మూడో ఏడాది నెంబర్‌వన్
అలాగే 2007లో ఇండియాపై న్యూజిలాండ్ తన మొదటి T20 మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ప్రతి టీ20లో కనీసం 100 పరుగులు చేసింది. కానీ లక్నోలో జరిగిన మ్యాచ్‌లో 100కు ఒక్క పరుగు దూరంలో కివీస్ ఆగిపోయింది. 20 ఓవర్లలో 99/8కి పరిమితం అయింది.
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 19 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ కేవలం 59.37 మాత్రమే. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 30 బంతులు ఆడి తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన భారత ఓపెనర్‌గా కిషన్ చెత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు గతేడాది ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై 83.33 స్ట్రైక్ రేట్‌తో 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. లక్నోలో కిషన్ తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.
ఆదివారం జరిగిన రెండో టీ20లో ఒక్క ప్లేయర్ కూడా సిక్స్ బాదలేకపోయారు. భారీ హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా బాల్‌ను బౌండరీ దాటించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 239 బాల్స్ చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో 120, రెండో ఇన్నింగ్స్‌లో 119 బాల్స్ వేశారు. కానీ ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. దీంతో ఎక్కువ బాల్స్ ఆడి సిక్స్ నమోదు కాని మ్యాచ్‌గా రికార్డు సొంతం చేసుకుంది. ఈ రికార్డు ఇంతకుముందు 2021లో మీర్‌పూర్‌లో జరిగిన బంగ్లా, కివీస్ మ్యాచ్ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో 239 బంతులు ఆడినా ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.
Abdul Razzaq: ఆ పాక్ బౌలర్ ముందు బుమ్రా పనికిరాడు: పాక్ మాజీ ప్లేయర్